![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -718 లో.....సూరజ్ షర్ట్ పై కావాలనే పప్పు పడేస్తుంది జ్యోత్స్న. దాంతో జ్యోత్స్నకి సూరజ్ వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఈ షర్ట్ క్లీన్ చెయ్యకపోతే నీ కాస్ట్లీ చీరని కాల్చేస్తానని సూరజ్ అంటాడు. అంతే కాకుండా మొన్న గీతకి క్యారేజ్ ఇచ్చి పంపించింది మీరే అని అందరికి చెప్తానని సూరజ్ అనగానే నువ్వు ఏమైనా చేసుకోమని జ్యోత్స్న కోప్పడుతుంది.
మరొకవైపు శౌర్య చదువుకోకుండా అల్లరి చేస్తుంటే.. నీకు చదువు తప్ప అన్నీ కావాలని కాంచన అంటుంది. మా అమ్మ అయిదో తరగతి చదివి సీఈఓ అయింది.. నేను కనీసం మేనేజర్ కూడా కాలేనా అని శౌర్య అనగానే మీ అమ్మకే కౌంటర్ వేస్తున్నావా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప నువ్వు వెళ్లి పడుకో.. ఇప్పటికే లేట్ అయింది. నీ కడుపులో బిడ్డ ఉందని కాంచన కోప్పడుతుంది. నువ్వు చూపినట్లు మేం చేస్తాం.. మేం చెప్పినట్లు నువ్వు చేస్తావా అని కాంచనతో కార్తీక్ అనగానే కాంచన సైలెంట్ అవుతుంది. మరొకవైపు సూరజ్ షర్ట్ ని జ్యోత్స్న క్లీన్ చేస్తుంది. సూరజ్, పారిజాతం పక్కన కూర్చొని స్నాక్స్ తింటుంటారు. తీరా సూరజ్ షర్ట్ చూసేసరికి అది చిరిగి ఉంటుంది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు చెప్పమ్మ మేం అడిగిన దానికి సమాధానం చెప్పమని కార్తీక్ అనగానే అప్పుడే కాంచనకి శ్రీధర్ నుంచి వీడియో మెసేజ్ వస్తుంది. అది కార్తీక్ చూసి నువ్వు ఓపెన్ చేసి చూడు అంటాడు. అందరం విందామని కాంచన అంటుంది.
అందులో నా ఆపరేషన్ సక్సెస్ అయింది.. రేపే ఇండియాకి వస్తున్నానని శ్రీధర్ చెప్పడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరుసటిరోజు అందరు గుడికి వెళ్తారు. అక్కడ అన్నదానం చేసేది ఎవరని కార్తీక్ అనగానే అక్కడ హోమం చేస్తున్న వాళ్ళు అని పంతులు దక్షిణామూర్తిని చూపిస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. పంతులు మీ పిల్లల పేరు చెప్పండి అని దక్షిణామూర్తి అడుగుతాడు. నా కూతురు క్షేమం కోసం చేస్తున్నా నా కూతురు సుమిత్ర, అల్లుడు దశరథ్ అని దక్షిణామూర్తి చెప్తాడు. అక్కడే మాలిని కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |